డియర్ బాలీవుడ్.. మా హీరోలను వదిలేయండి ప్లీజ్!
Hyderabad: బాహుబలి సినిమాతో మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్యాన్ ఇండియన్ లెవల్‌కి వెళ్లిపోయింది (bollywood). దాంతో ప్రభాస్ (prabhas) కూడా ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అప్పటివరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ (bollywood) మాత్రమే అనుకునేవారు. కానీ రాజమౌళి విజన్ గేమ్ ఛేంజర్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్‌ను మించిన సినిమాలు తీసి శెభాష్ అనిపించుకుంటోంది టాలీవుడ్ (tollywood). నిజానికి.. ఎప్పుడైతే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput) సూసైడ్ చేసుకుని చనిపోయాడో అప్పటినుంచి బాలీవుడ్‌కి శని మొదలైంది.
ఒక వర్గానికి చెందినవారు బయటివాళ్లకు అవకాశాలు ఇవ్వడంలేదని వారి గురించి తప్పుడు వార్తలు రాయించి మానసికంగా కుంగిపోయేలా ఇండస్ట్రీకి వదిలి వెళ్లిపోయేలా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో అటు నార్త్ ఆడియన్స్ కూడా హిందీ సినిమాలను ఆదరించలేదు. నిజానికి దాదాపు మూడు, నాలుగేళ్లుగా బాలీవుడ్ నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేదు. ఇప్పుడంటే ఏదో పఠాన్, గంగూబాయి కఠియవాడి సినిమాలు కాస్త అలరించాయి. కానీ బాలీవుడ్ (bollywood) బిజినెస్ పూర్తిగా డీలాపడిపోయిందనే చెప్పాలి.
దాంతో ఎక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ డామినేట్ చేస్తుందోనన్న భయం బాలీవుడ్‌లో ఒక వర్గానికి చెందిన నిర్మాతలకు పట్టుకుంది. అందుకని తెలుగులో టాప్ స్థానాల్లో ఉన్న హీరోలకు హిందీలో ఛాన్సులు ఇచ్చి వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇప్పుడిప్పుడు మొదలైనది కాదు. పదేళ్ల క్రితం రామ్ చరణ్ (ram charan) జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అట్టర్ ఫ్లాప్ చేసేసారు. దాంతో ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నప్పటికీ చరణ్ ఒప్పుకోవడంలేదు. ఆ తర్వాత వచ్చిన లైగర్ సినిమా ప్రమోషన్స్ సమయంలోనూ కరణ్ జోహార్ (karan johar) సినిమా ఫ్లాప్ అవ్వాలనే దురుద్దేశంతో ఉన్నాడట.
ఇప్పుడు ఆదిపురుష్ (adipurush) కూడా అంతే. 500 కోట్లు పెట్టి రామాయణాన్ని చూపించాలనుకున్నప్పుడు డైరెక్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చీప్ VFXలను పెట్టి.. బ్యాటిల్ గ్రౌండ్స్‌లోని కొన్ని బ్యాక్‌గ్రౌండ్ ఇమేజస్‌ని సినిమాలో వాడి నవ్వుల పాలు చేసాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో (jr ntr) వార్ 2 (war 2) సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వబోతున్నారో వేచి చూడాలి.
ఇవన్నీ చాలదన్నట్లు.. నితీష్ తివారీ అనే హిందీ డైరెక్టర్ ఆలియా భట్ (alia bhatt), రణ్‌బీర్ కపూర్‌లను (ranbir kapoor) పెట్టి మరోసారి రామాయణం తీయాలనుకుంటున్నారు. పైగా ఇందులో తెలుగులోనూ మంచి స్టార్‌డం సంపాదించుకున్న కన్నడ సూపర్‌స్టార్ యష్‌ను (yash) రావణాసురుడి క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించారు. యష్ ముందుచూపు ఉన్నవాడు కాబట్టి నేను చెయ్యను అని ముఖం మీద చెప్పేసాడు. యష్ తీసుకున్న నిర్ణాయనికి ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. కాబట్టి.. ఇక్కడ ఎంతో కష్టపడి స్టార్‌డం సంపాదించుకున్న టాప్ హీరోలను బాలీవుడ్‌కి తీసుకెళ్లి వారి ఇమేజ్ డ్యామేజ్ చేయకూడదని పలువురు సినీ విశ్లేషకులు బాలీవుడ్‌ని వేడుకుంటున్నారు.