Dasara: డిలీటెడ్​ సీన్స్​తో లాజిక్​ మిస్సయిందా!

నేచురల్​ నాని , కీర్తి సురేష్​ జంటగా నటించిన తాజా సినిమా దసరా. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో ఓవర్సీస్​లో మిలియన్​ డాలర్ల మార్క్ దాటేసి రికార్డు కూడా కొట్టేసింది. డెబ్యూ డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి వంద కోట్ల క్లబ్​లో చేరిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు అయిదు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూపర్​ సక్సెస్​తో పాన్​ ఇండియా స్టార్స్​ జాబితాలో నాని కూడా చేరిపోయాడు. దేశంలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ దసరా సినిమా తిరుగులేని కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. కాగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతి విషయంలోనూ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్ ఒక లాజిక్​ని మాత్రం మిస్​ అయినట్టు తెలుస్తోంది. అది కూడా చిత్రయూనిట్​ స్వయంగా ఒప్పుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ప్రస్తుతం దసరా సినిమాలోని డిలేటెడ్​ సీన్స్​పై చర్చ జరుగుతోంది.

దసరా వంద కోట్ల క్లబ్​లో చేరిన సందర్భంగా ‘దసరా’దావత్​ను ఘనంగా చేసుకున్నారు చిత్రయూనిట్​ సభ్యులు. ఈ దావత్​కు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరితోపాటు మరికొందరు ప్రముఖులూ హాజరయ్యారు. కాగా ఈ దావత్​లో జరిగిన ఒక సంభాషణ ట్విటర్​ వేదికగా వైరల్​ అవుతోంది. అది చూసిన నెటిజన్​లు సైతం.. ‘నిజమే.. ఆ సీన్​ డిలీట్​ చేయకుండా ఉండాల్సింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. దసరా సినిమాలో ధరణి, వెన్నెలను ప్రేమిస్తాడు. అదే సమయంలో ధరణి స్నేహితుడు సూరి కూడా వెన్నెలను ప్రేమిస్తాడు. అయితే ధరణి తన స్నేహితుడు సూరి కోసం వెన్నెలను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ చర్చకు దారితీసే అంశం ఏంటంటే.. స్నేహితుడికోసం ప్రేమను వదులుకునే అవసరం ఏముంది?, అంత స్నేహం వారి మధ్య ఎలా ఏర్పడింది? అనేదే ప్రశ్న. అయితే ధరణి, సూరి మధ్య స్నేహం గొప్పతనాన్ని వివరించేందుకు ఓ సీన్​ తీశాడట శ్రీకాంత్​. ఆ సీన్​లో చిన్నప్పుడు ధరణికి అమ్మవారు పోసి అందరూ దగ్గరకు రావడానికి కూడా భయపడుతుంటే​ సూరి మాత్రం వెళ్లి ధరణిపై చెయ్యి వేసి ధైర్యం చెబుతాడట. తెల్లారెసరికి సూరికీ అమ్మవారు పోస్తుందట. అయితే తనకు ప్రమాదమని తెలిసీ సూరి తన స్నేహితుడికోసం అంత త్యాగం చేశాడనేది సారాంశం. అయితే ఎడిటింగ్​లో భాగంగా ఈ సీన్​ని తొలిగించారు. ఆ సీన్​ ఉంటే కథలో మరింత క్లారిటీ ఉండేది అంటున్నారు విశ్లేషకులు. తాజాగా రిలీజ్​ చేసిన డిలేటెడ్​ సీన్​ కూడా సినిమాకు మరింత ప్లస్​ అయ్యేదంటున్నారు. యూట్యూబ్​లో ట్రెండ్​ అవుతున్న ఈ సీన్లో కీర్తి సురేష్​ తన నటనతో ఆకట్టుకుంది.​

అయితే, దీనిపై నాని మాట్లాడుతూ ‘సినిమాల్లో ప్రతిదానికీ లాజిక్​ వెతుకుతాం. కానీ నిజజీవితంలో ప్రతీది లాజిక్​తో జరగదు. దసరా సినిమా కాదు, నిజంగా జీవితమే’ అంటూ చెప్పుకొచ్చారు. అది విన్న నాని ‘అభిమానులు నిజంగానే నాని నేచురల్​ స్టార్’​ అంటూ సంబరపడిపోతున్నారు. దసరా విడుదలైన రోజునుంచీ మంచి కలెక్షన్లతో క్లీన్​ హిట్​గా నిలిచింది. ఈ సినిమాపై అభిమానులే కాదు, సినీ ప్రముఖులూ ప్రశంసలు కురిపించారు. సూపర్​స్టార్​ మహేష్​ బాబు, యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ సోషల్​ మీడియా వేదికగా నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు దర్శకధీరుడు రాజమౌళితోపాటు తన శిష్యుడి టేకింగ్​పై క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కూడా ప్రశంసలు కురిపించారు.