Darshan Thoogudeepa: రేణుకా స్వామి ఆత్మ క‌నిపిస్తోంది.. వేరే జైల్లో పెట్టండి ప్లీజ్

Darshan Thoogudeepa says renuka swamy ghost is scaring him in jail

Darshan Thoogudeepa: ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప.. రేణుకా స్వామి అనే అభిమానిని హ‌త్య చేసిన కార‌ణంగా నాలుగు నెల‌ల నుంచి జైల్లో ఉంటున్నాడు. ముందు అత‌న్ని బెంగ‌ళూరులోని అగ్ర‌హార ప‌ర‌ప్ప‌ణ జైల్లో ఉంచ‌గా.. అక్క‌డ ఆయ‌న‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తుండ‌డంతో వెంట‌నే బ‌ళ్ళారి జైలుకు త‌ర‌లించారు. అయితే.. ఈ మ‌ధ్య‌కాలంలో ద‌ర్శ‌న్‌కు రేణుకా స్వామి ఆత్మ క‌నిపిస్తోంద‌ట‌. నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని.. రేణుకా స్వామి దెయ్యంలా క‌నిపిస్తున్నాడ‌ని జైలు అధికారుల‌తో చెప్పాడు. ద‌ర్శ‌న్ అర్థ‌రాత్రి క‌ల‌వ‌రిస్తూ కేక‌లు వేస్తున్నాడ‌ని జైల్లోని ఇత‌ర ఖైదీలు కూడా స‌మాచారం అందించారు. త‌న‌ను బెంగ‌ళూరు సెంట్ర‌ల్ జైలుకే త‌ర‌లించాల‌ని కోరాడు. అయితే ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు. మ‌రోప‌క్క ద‌ర్శ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది బెయిల్ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ కేసులో ఏ1గా ఉన్న న‌టి ప‌విత్రా గౌడ‌కు కూడా బెయిల్ ల‌భించ‌లేదు.