Darshan: చేతులెత్తి మొక్కుతున్నాను.. న‌న్ను వ‌దిలేయండి స‌ర్

darshan requests police to leave him

Darshan: ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప‌.. అభిమాని అయిన రేణుకా స్వామి మ‌ర్డ‌ర్ కేసులో పోలీసుల ఆధీనంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. కోర్టు ద‌ర్శ‌న్‌కు.. ఆయ‌న స్నేహితురాలైన న‌టి ప‌విత్ర గౌడ‌కు జూన్ 20 వ‌ర‌కు క‌స్ట‌డీని విధించింది. ఈ నేప‌థ్యంలో పోలీసులు ద‌ర్శ‌న్‌ను విచార‌ణ చేప‌డుతుండ‌గా.. చేతులు జోడించి వేడుకుంటున్నాను స‌ర్. ద‌య‌చేసి న‌న్ను వ‌దిలేయండి అని రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోప‌క్క రేణుక స్వామి హ‌త్యకు సంబంధించి రోజుకో షాకింగ్ వార్త బ‌య‌టికి వస్తోంది. ఇప్ప‌టికే రేణుకా స్వామి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లిన కారు డ్రైవ‌ర్ పోలీసుల ముందు లొంగిపోయాడు.