Darshan: సొంత సోదరుడు అద్దె ఇంట్లో.. ప్రేయసికి లగ్జరీ లైఫ్
Darshan: కన్నడ నటుడు దర్శన్ విషయంలో రోజుకో కొత్త కథ బయటికి వస్తోంది. దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని దారుణంగా చంపిన కేసులో దర్శన్‌తో పాటు ఆయన ప్రేయసి పవిత్రా గౌడను కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శన్‌ను విచారిస్తున్న కొద్ది రోజుకో కొత్త ట్విస్ట్ బయటికి వస్తోంది. ఇప్పటికే దర్శన్ ఫామ్ హౌజ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ అనే వ్యక్తి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు దర్శన్ ఫాం హౌజ్‌లో అరుదైన పక్షిని పెంచుకుంటున్నాడని.. అది నేరమని పోలీసులు చెప్తున్నారు.
ఇకపోతే.. ఆల్రెడీ దర్శన్‌కు విజయలక్ష్మి అనే యువతితో వివాహమై వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ దర్శన్ పవిత్ర గౌడతో ఎఫైర్ పెట్టుకున్నాడు. వీరిద్దరికీ పెళ్లి జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే.. దర్శన్‌కు ఓ సొంత సోదరుడు ఉన్నాడు. అతని పేరు దినకర్ తూగుదీప. ఇతను ఇప్పటికీ బెంగళూరులో ఓ 1 బీహెచ్‌కే తీసుకుని అద్దెకు ఉంటున్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో డి బాస్‌గా పేరుగాంచిన దర్శన్.. అంత డబ్బు సంపాదించిన సొంత సోదరుడిని ఆదుకోలేకపోయాడు కానీ.. ప్రేయసికి మాత్రం లగ్జరీగా బతికేందుకు అన్ని విధాలా సమకూర్చినట్లు తెలుస్తోంది.