Custody: మాస్ యాక్ష‌న్ వేనుమా.. ఉన్నాయ్‌.. అన్నీ ఉన్నాయ్!

Hyderabad: టాలీవుడ్​ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’ (Custody). ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) తెలుగు, తమిళ్‌లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించిన ఈ మూవీలో కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్​గా నటించింది. ‘కస్టడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ఈవెంట్​లో దర్శకుడు వెంకట్​ ప్రభు మాట్లాడుతూ.. ‘స్టైల్ వేనుమా స్టైల్ ఉంది.. మాస్ యాక్ష‌న్ వేనుమా.. ఉంది.. అన్నీ ఉన్నాయ్. ఈ సినిమాలో మీరు కొత్త నాగచైతన్యను చూస్తారు. సినిమా మొదటి 20 నిమిషాలు వెంకట్​ గారి మార్క్​తో కూల్​గా ఉంటుంది. కానీ అసలైన యాక్షన్​ ఇంటర్వెల్​కి ముందే ప్రారంభమవుతుంది. ఇక క్లైమాక్స్​ ఎవరూ ఊహించని రీతిలో ఆకట్టుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు చైతన్య. ‘ఈ సినిమాలో నేను కాస్త డీ గ్లామర్ గా కనిపిస్తాను. నేను చేసిన ‘రేవతి’ పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడూ నా ఫేవరేట్ చై గారే. నా ‘బంగార్రాజు’ .. నా శివ ఆయనే. ఈ సినిమాలో ఆయన చేసిన శివ పాత్ర లవ్ లో ఒక్క రేవతి మాత్రమే కాదు .. అందరూ లవ్ లో పడిపోతారు’ అంటూ చెప్పుకొచ్చింది బేబమ్మ.