Naga chaitanya: విడాకుల త‌ర్వాత ఎంత మందిని కిస్ చేసారు?

Hyderabad: టాలీవుడ్​ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) నటించిన తాజా చిత్రం కస్టడీ(Custody). వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మంచి హైప్‌నే క్రియేట్‌నే చేశాయి. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గతేడాది దసరాకు రిలీజైన నాగార్జున ‘ది ఘోస్ట్‌’, లేటెస్ట్‌గా విడుదలైన అఖిల్​ ‘ఏజెంట్‌’(Agent) రెండు సినిమాలూ అక్కినేని ఫ్యాన్స్‌ను తేరుకోలేని దెబ్బ కొట్టాయి. దాంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు కస్టడీ అయినా హిట్​ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస ప్రమోషన్‌లతో బిజీ బిజీగా గడుపుతోంది.

కస్టడీ ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో తన క్రష్‌ గురించి చెప్పుకొచ్చారు. ఇటీవలే ‘బేబీలాన్‌’ అనే హాలీవుడ్‌ సినిమా చూశానని, అందులో మార్గొట్‌ రాబ్బీ(Margot Robbie) పర్‌ఫార్మెన్స్‌ బాగా నచ్చిందని చెప్పారు చై. ఆమె నటనకు, ఆమెకు పడిపోయాని అన్నారు. అంతేకాదు స‌మంత‌తో విడాకుల త‌ర్వాత ఎంత మందిని కిస్ చేసారు అని అడిగితే.. లెక్క గుర్తులేదు అని షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. అయితే సినిమాలో చాలా కిస్సింగ్ సీన్స్ ఉంటాయ‌ని, అవ‌న్నీ ఎలా లెక్క‌పెడ‌తామ‌ని క‌వ‌ర్ చేసారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన కస్టడీ సినిమాలో నాగచైతన్యకు జోడీగా ఉప్పెన(Uppena) బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) నటించింది. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కీలక పాత్ర పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విజయం అటు అక్కినేని కుటుంబం, నాగచైతన్యతోపాటు కృతి శెట్టి కెరీర్​ కు కూడా ఎంతో కీలకం కానుంది.