Custody: ప్రమోషన్స్​ కోసం అక్కినేని హీరో స్టంట్స్​!

టాలీవుడ్​ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తాజా సినిమా ‘కస్టడీ’. కోలీవుడ్​ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 12న భారీగా విడుదల కానుంది. తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించారు. నాగచైతన్య పోలీసుగా నటించిన ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే విడుదల చేసి ప్రమోషన్స్​ మొదలుపెట్టారు మేకర్స్​. ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో నాగచైతన్య కూడా ప్రమోషన్స్​లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా రీల్ పోలీస్​ విత్​ రియల్​ పోలీస్​ కార్యక్రమాన్ని నిర్వహించారు మేకర్స్​. దీనిలో భాగంగా నాగచైతన్య రియల్​ పోలీసులతో ముచ్చటించడమే కాకుండా వారితో ఆడిపాడి, పలు స్టంట్​లు కూడా చేశారు.

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌‌కు వెళ్లిన నాగచైతన్య.. అక్కడి పోలీసు అధికారులతో కాసేపు ముచ్చటించారు. పోలీసుల కోరిక మేరకు సినిమాలో చేసిన స్టంట్లు రియల్‌గా చేసి చూపించారు. ఒక పోలీసు అధికారితో పోటాపోటీగా నాన్‌స్టాప్‌గా 30 గుంజీలు తీశారు. అలాగే, రియల్ పోలీసులతో కలిసి మఫ్టీలో తనకు కూడా డ్యూటీ చేయాలనుందని చెప్పారు. చివరిగా పోలీసులతో కలిసి డాన్స్ చేశారు నాగచైతన్య. మొత్తం మీద ఈ ప్రమోషనల్ వీడియో సినిమాను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడేలా ఉంది. ఈ వీడియో చూసిన అక్కినేని అభిమానులు తమ హీరో చేస్తున్న స్టంట్స్​ చూసి ముచ్చటపడిపోతున్నారు. ఈసారి చై కచ్చితంగా హిట్​ కొట్టాలని కోరుకుంటున్నారు.

ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగా నటించింది. అరవింద్ స్వామి విలన్. దక్షిణాదిన హిట్​ సినిమాలతో అలరించిన హీరోయిన్​ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నాగ చైతన్య కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా ‘కస్టడీ’ రూపొందుతోంది. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అబ్బూరి రవి మాటలు రాసిన ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.

ఇక, గత ఏడాది సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన లవ్​స్టోరీతో సక్సెస్​ అందుకున్నారు నాగచైతన్య. ఆ తర్వాత వచ్చిన థాంక్యూ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా, కస్టడీతో మంచి హిట్​ కొట్టి కమ్​బ్యాక్​ అవ్వాలని చూస్తున్నారు చై. ఈ సినిమా కోసం చాలా కష్టపడిన చై లుక్స్​ని పూర్తిగా మార్చేసి బాడీ కూడా పెంచేశారు. ఈ సినిమా సక్సెస్​ చై కెరీర్​కి చాలా అవసరమంటున్నారు సినీ విశ్లేషకులు.