Bigg Boss: బిగ్‌బాస్‌లోకి ఇద్ద‌రు పెళ్లాల‌తో ఎంట్రీ.. ఏం బ‌తుకులు రా మీవి

contestant entering bigg boss with 2 wives sparks row

Bigg Boss: టీఆర్పీ రేటింగ్‌లో కోసం ఈ మ‌ధ్య‌కాలంలో టీవీ షోలు, రియాల్టీ షోలో దిగ‌జారిపోతున్నాయి. ఫ్యామిలీతో క‌లిసి చూసే షోల‌ల్లో డ‌బుల్ మీనింగ్ డైలాగులు, న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తూ అస‌లు టీవీ ఆన్ చేయాలంటేనే రోత పుట్టేలా చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగులో ఓ షోలో ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ, కొరియోగ్రాఫ‌ర్ రాకేష్ మాస్ట‌ర్‌లు కెమెరా ముందు చొక్కాలు విప్ప‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ ప‌ట్ల నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈసారి హిందీ బిగ్‌బాస్‌కి ప్ర‌ముఖ న‌టుడు అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో వీడియోలు, రీల్స్ చేసుకుని పాపుల‌ర్ అయిన వారిని కంటెస్టెంట్లుగా ఎంపిక‌చేసారు. అలా అర్మాన్ మాలిక్‌ని అనే వ్య‌క్తిని కూడా ఎంపిక చేసారు. ఇత‌నికి ఇద్ద‌రు భార్య‌లు. పైగా ముగ్గురూ క‌లిసే ఇంట్లో ఉంటార‌ట‌. వాళ్లు ఏలా ఏడిస్తే మ‌న‌కేంటి కానీ.. ఇలా ఇద్ద‌రు భార్య‌ల‌తో క‌లిసి అర్మాన్ షోలో పాల్గొన‌డం.. అదేదో పెద్ద ఘ‌న‌కార్యం చేసిన‌ట్లు అనిల్ క‌పూర్ వారిని స్టేజ్‌పై పొగ‌డటం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఇలాంటి వారిని ఎంక‌రేజ్ చేస్తూ ఎంత మందినైనా పెళ్లి చేసుకోమ‌ని స‌మాజానికి సందేశం ఇస్తున్నారా యాక్ తూ ఏం బ‌తుకులు రా మీవి అంటూ నెటిజన్లు నానా మాట‌లు అంటున్నారు.