Citadel: ‘అదరగొట్టేశావ్​’.. ప్రియాంకకు హృతిక్​ ప్రశంస!

Mumbai: బాలీవుడ్(Bollywood)​ స్టార్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం హలీవుడ్(Hollywood)​లోనూ రాణిస్తోంది. తాజాగా ప్రియాంక నటించిన సిటాడెల్​(Citadel)అనే అమెరికన్​ వెబ్​ సిరీస్​ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్​ అవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ గా వస్తున్న మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించి వరల్డ్ టాప్ వెబ్ సిరీస్ గా నిలిచింది. ఇక, తాజాగా ఈ సిరీస్​ చూసిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రాని సోషల్​ మీడియా వేదికగా తెగ మెచ్చుకున్నారు.

‘ప్రియాంక సిటాడెల్ చూశాను. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మీ అద్భుతమైన వర్క్ చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యాను. ప్రియాంక ఈసారి నువ్వు అదరగొట్టేశావ్. చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే’ అంటూ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు హృతిక్​. ఇక దీనికి ప్రియాంక రెస్పాండ్ అవుతూ.. ‘థాంక్స్ మై ఫ్రెండ్’ అంటూ రిప్లై ఇచ్చింది.

కాగా వీరిద్దరూ కలిసి ‘క్రిష్’(Krrish) సూపర్ హీరో సిరీస్ రెండు భాగాల్లో నటించారు. ప్రస్తుతం హృతిక్​ వార్​2(War 2) షూటింగ్​తో బిజీగా ఉన్నారు. ఇక, ఈ సిరీస్​ ఇండియన్​ వెర్షన్​లో టాలీవుడ్​ హీరోయిన్​ సమంత(Samantha) నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్​ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.