Chiyaan Vikram: ప్రెస్‌మీట్‌లో విక్ర‌మ్‌కు అవ‌మానం

chiyaan vikram sharp answer to a journalist who questioned about his fandom

Chiyaan Vikram:  ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విక్ర‌మ్‌కు ప్రెస్‌మీట్‌లో అవ‌మానం జ‌రిగింది. సొంత త‌మిళ జ‌ర్న‌లిస్టే ఆయ‌న్ను అవ‌మానించేలా ఒక ప్ర‌శ్న వేయ‌డంతో రచ్చ నెల‌కొంది. విక్ర‌మ్ న‌టించిన తంగ‌లాన్ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా ఈరోజు త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఓ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఓ జ‌ర్న‌లిస్ట్ విక్ర‌మ్‌కు ఈ ప్ర‌శ్న అడిగాడు. స‌ర్ మీకు ఫ్యాన్స్ చాలా త‌క్కువ క‌దా? అంటే సూర్య‌, అజిత్‌కి ఉన్న ఫ్యాన్స్ మీకు లేరు క‌దా? అని అడిగాడు. దాంతో విక్ర‌మ్ ఇలా స‌మాధానం ఇచ్చాడు. నాకు ఫ్యాన్స్ లేరా? నా సినిమా రిలీజ్ అయిన రోజు థియేట‌ర్‌కి వ‌చ్చి చూడు తెలుస్తుంది నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో. అని న‌వ్వుతూనే స‌మాధానం ఇచ్చారు. దాంతో విక్ర‌మ్ ఫ్యాన్స్ స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్‌పై మండిప‌డుతున్నారు. విక్ర‌మ్ లాంటి న‌టుడిని ప‌ట్టుకుని సొంత ప్రాంతం వారే ఇలాంటి ప్ర‌శ్న‌లు అడిగితే ఇక బ‌య‌టి ఇండ‌స్ట్రీల ముందు ఆయ‌నకు ప‌రువు ఏముంటుంది అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.