Daniel Balaji: చిరుత విల‌న్ క‌న్నుమూత‌

Daniel Balaji: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, రామ్‌చ‌ర‌ణ్ తొలి చిత్రం చిరుతలో విల‌న్ పాత్ర‌ను పోషించిన డేనియ‌ల్ బాలాజీ క‌న్నుమూసారు. నిన్న రాత్రి ఆయ‌న గుండెపోటుకు గుర‌య్యారు. హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా అక్క‌డ చికిత్స పొందుతూ ఈరోజు తెల్ల‌వారుజామున చ‌నిపోయారు. ఘ‌ర్ష‌ణ సినిమాలో శ్రీకాంత్ అనే పోలీస్ అధికారి పాత్ర‌లో న‌టించి ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు.