Chiranjeevi: అమ్మ నవ్వు చూస్తే అన్నీ మర్చిపోతాం!
Hyderabad: ప్రపంచ మాతృదినోత్సవం(Mother’s Day) సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా తమ తల్లులతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. తమకు జన్మనిచ్చిన తల్లుల వెలకట్టలేని సేవలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మదర్స్ డేను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తల్లితో మరుపురాని క్షణాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్థమే అమ్మ .. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి హ్యాపీ మదర్స్ డే’ అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. తల్లి అంజనా దేవి, సోదరుడు నాగేంద్రబాబు, సోదరీమణులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. మరోవైపు తమ తల్లితో సోదరుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగిన మరో స్టిల్‌ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్ (Bhola Shankar) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్(Keerthy Suresh) నటిస్తుండగా, హీరోయిన్గా తమన్నా భాటియా(Tamannah Bhatia) నటిస్తోంది. ఆగస్టు 11న రిలీజ్ కానున్న ఈ సినిమాను మెహర్ రమేష్ రూపొందిస్తున్నారు.