Bhola shankar: జ‌ర్న‌లిస్ట్ కోరిక‌.. ఎక్స్‌క్లూజివ్ పిక్ పంపిన మెగాస్టార్!

Hyderabad: మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్ర‌స్తుతం భోళా శంక‌ర్(bhola shankar) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మెహ‌ర్ ర‌మేష్(meher ramesh) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రుగుతోంది. అయితే ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్..భోళా శంక‌ర్(bhola shankar) షూట్ నుంచి ఎక్స్‌క్లూజివ్ పిక్ పంప‌మ‌ని చిరుని రిక్వెస్ట్ చేసార‌ట‌. అడిగిన వెంట‌నే ఆయ‌న పిక్ పంపించి స‌ర్‌ప్రైజ్ చేసారు. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న వేదాళం(vedalam) సినిమాకు భోళా శంక‌ర్ రీమేక్‌గా రాబోతోంది. ఇక‌పోతే.. ఇందులో అక్కినేని హీరో సుశాంత్(sushanth) ఓ కీ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు.

ఇక హీరోగా వ‌ర్క‌వుట్ కాద‌ని ఫిక్స్ అయిపోయిన సుశాంత్.. సైడ్ క్యారెక్ట‌ర్స్‌తో ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల రిలీజైన రావ‌ణాసుర సినిమాలో కూడా సుశాంత్ మంచి క్యారెక్ట‌ర్‌లో యాక్ట్ చేసారు. సుశాంత్‌తో పాటు ప్ర‌ముఖ న‌టుడు శ్రీకాంత్ కొడుకు రోష‌న్(roshan) కూడా ఓ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నాడ‌ట‌. పెళ్లిసంద‌డి సినిమాతో మంచి హిట్ అందుకున్న రోష‌న్‌కు ఈ సినిమా ట‌ర్నింగ్ పాయింట్‌గా మార‌బోతోంద‌ని టాలీవుడ్ టాక్. ఇక భోళా శంక‌ర్ సినిమాలో త‌మ‌న్నా భాటియా(tamannah) హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్‌(keerthy suresh)..చిరుకి చెల్లెలి క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. ఆగ‌స్ట్‌లో మూవీ రిలీజ్ అవ‌బోతోంది.