Chiranjeevi: పాప జాత‌కం బ్ర‌హ్మాండం.. మా ఇంట్లో అన్నీ శుభాలే

Hyderabad: త‌న మ‌న‌వ‌రాలి జాత‌కం బ్ర‌హ్మాండంగా ఉందంటూ మురిసిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi). నిన్న ఉద‌యం రామ్ చ‌ర‌ణ్‌ (ram charan), ఉపాస‌న‌ (upasana)లు పండింటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో మెగా ఇంట సంబ‌రాలు మిన్నంటాయి. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మ‌న‌వ‌రాలి గురించి మాట్లాడుతూ.. పాప జాత‌కం బ్ర‌హ్మాండంగా ఉందంటున్నార‌ని తెలిపారు. అందులోనూ త‌మ‌కెంతో ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజున ఉద‌యం 1:49కి శుభ ఘ‌డియ‌ల్లో పాప పుట్టినందుకు ఇంకా సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఆ శుభ ఘ‌డియ‌ల ప్ర‌భావం ఆల్రెడీ ఇంట్లో మొద‌లైపోయింద‌ని, చ‌ర‌ణ్ కెరీర్‌లో ఎదుగుద‌ల‌, వ‌రుణ్ తేజ్ నిశ్చితార్ధం.. ఇలా త‌మ కుటుంబంలో అన్నీ శుభాలే జ‌రుగుతున్నాయంటూ మురిసిపోతున్నారు చిరు.