Chiranjeevi: ఎంతపని చేసారు బాసూ..!
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నుంచి ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకునేది ఒక్కటే.. మాస్ సినిమాల్లో నటిస్తూ ఒకప్పటి బాస్‌లాగే ఉండాలని. కానీ కొందరు దర్శకుల పుణ్యమా అని ఆయనలోని టాలెంట్‌ను వాడుకోలేక రోత సినిమాలను అంటగడుతున్నారు. ఈ సినిమాల సంగతి పక్కనపెడితే.. మెగాస్టార్ కటౌట్‌కి వెబ్‌సిరీస్‌లలో నటించినా అదిరిపోతుంది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ (family man) ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.
ఇందులో ప్రధాన పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ (manoj bajpayee) నటించారు. కానీ రాజ్, డీకేలు ముందు ఈ స్టోరీని చిరంజీవికే వినిపించారట. కానీ ఆయన ఎందుకో ఒప్పుకోలేదు. అప్పటికీ చిరుకి నచ్చేలా స్క్రిప్ట్‌లో ఎన్నో మార్పులు చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఆ ఛాన్స్ మనోజ్ బాజ్‌పాయ్‌కి వెళ్లిపోయింది. ఈ క్యారెక్టర్‌లో బాస్ నటించి ఉంటే ఇంకెంత పెద్ద హిట్ అయివుండేదో ఊహించనక్కర్లేదు. ఈసారైనా ఇలాంటి మాంచి ఓటీటీ కంటెంట్ ఉన్న స్క్రిప్ట్‌లు వస్తే చిరంజీవి ఒప్పుకుంటారని ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు. (chiranjeevi)