Chiranjeevi: రేవంత్ అస‌హ‌నం.. చిరంజీవి పెద్ద‌రికం

chiranjeevi reacts on revanth reddy remarks on gaddar awards

Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌దానం చేద్దామని టాలీవుడ్ పెద్ద‌ల‌తో చ‌ర్చిస్తే క‌నీసం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌రి నుంచి కూడా స‌మాధానం కానీ స్పందన కానీ లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రేవంత్ అలా అస‌హ‌నం వ్య‌క్తం చేసారో లేదో.. విదేశాల్లో విహార‌యాత్ర‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి వెంట‌నే ఈ విష‌యంపై స్పందించారు. గ‌ద్ద‌ర్ అవార్డుల ప్రతిపాద‌న‌ను తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా ట్వీట్ట‌ర్ ద్వారా రిక్వెక్ట్ చేసారు.