Chiranjeevi: కూతురి బ్యానర్‌లో మెగాస్టార్ సినిమా!
Hyderabad: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లో సైరా నరసింహా రెడ్డి(Sye Raa Narasimha Reddy), ఆచార్య(Acharya) సినిమాలకు ఏకంగా నాలుగేళ్లు సమయం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత నుంచి చిరు అనూహ్యంగా స్పీడ్ పెంచేశారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాటిని త్వరగా పూర్తి చేసేస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే వరుసగా గాడ్ ఫాదర్(God Father), వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్(Bhola Shankar)గా వస్తున్నారు.
చిరంజీవి తన వయసు, ఇమేజ్, క్రేజ్‌కు తగిన సినిమాలకే ఓకే చెబుతున్నారు. ఇక, చిరంజీవి కూతురు సుస్మిత(Susmitha Konidela) కూడా ఇటీవలే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ కింద ఒక సినిమా ఒక వెబ్ సిరీస్ కూడా తీశారు. అయితే, ఆ రెండూ నిరాశపరిచాయి. ఆర్థికంగా కూడా ఫెయిల్ అయ్యాయి. దీంతో సుస్మిత బ్యానర్‌లో సినిమా చేసి ఆమెకు ఆర్థికంగా సహకరించాలని కూడా చిరు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా కథల కోసం డైరెక్టర్లను వెతుకుతున్నారని టాక్.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా చిత్రాలకు కథలు రాసిన ప్రసన్నకుమార్.. చిరు కోసం మూడు కథలు రాస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో చిరుకి ఏది నచ్చితే అది ఇచ్చేస్తారని టాక్. అయితే చిరంజీవికి నచ్చిన డైరెక్టర్ తో ఆ సినిమా తెరకెక్కిస్తారని సమాచారం. మరోవైపు సీనియర్ రైటర్ బీవీఎస్ రవి కూడా చిరు కోసం స్పెషల్ గా ఒక స్టోరీ రాస్తున్నారని తెలుస్తోంది.
సోగ్గాడే చిన్నినాయనా, బింబిసార దర్శకులు కూడా చిరుకు కథ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే చిరు హామీతో పూరి జగన్నాథ్(Puri Jagannath), వీవీ వినాయక్(VV Vinayak) కూడా మెగాస్టార్ కోసం కథలు రెడీ చేసే పనిలో ఉన్నారని టాక్.