డియ‌ర్ నాని.. ద‌స‌రా అదిరింది!

Hyderabad: నేచుర‌ల్ స్టార్ నాని(nani) న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ద‌స‌రా(dasara). మొన్న శ్రీరామ న‌వమికి రిలీజై 100 కోట్ల క్ల‌బ్లో చేరింది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) చూసారట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విటర్ ద్వారా వెల్ల‌డిస్తూ త‌న‌కు సినిమా ఎంత న‌చ్చిందో చెప్పారు. “డియ‌ర్ నాని, ద‌స‌రా చూసాను. ఎంత బాగుందో. నీ మేకోవ‌ర్, పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టేసావ్. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల‌కు ఇది ఫ‌స్ట్ సినిమా అని తెలిసి షాక‌య్యా. మ‌న మ‌హాన‌టి కీర్తి సురేష్ వావ్ అనేలా న‌టించింది. దీక్షిత్ శెట్టి కూడా త‌న స్టైల్‌లో అద‌రగొట్టాడు. సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ చాలా బాగుంది. ద‌స‌రా టీం మొత్తానికి అభినంద‌న‌లు” అని తెలిపారు. అయితే ద‌స‌రా సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరాక అభినంద‌న‌లు చెప్ప‌డంపై కూడా కొంద‌రికి న‌చ్చ‌న‌ట్టుంది. చిరు ఫ్యామిలీ నుంచి ఏ ట్వీట్ పెట్టినా కొంద‌రు నెటిజ‌న్లు ఏదో ఒక‌టి అన‌డానికి రెడీ అయిపోతుంటారు. లేట్‌గా చిరు విష్ చేయ‌డంతో ఇంకా న‌యం సినిమా ఓటీటీలోకి వ‌చ్చాక విష్ చేసారు కాదు అంటూ వెక్కిలిగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ.. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన‌దానికంటే.. చిరు నుంచి కాంప్లిమెంట్ అందుకున్నందుకు నాని ఎంతో సంబర‌ప‌డిపోతారు.