Chinmayi Sripaada: కొంతమంది ఎదవల నోరు మూయించారు
Chinmayi Sripaada: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఏం చేసినా అది వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మరో విషయం వైరల్‌గా మారడంతో ఆమె సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్‌ని ఉదాహరణగా చూపిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
చిన్నయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ దంపతులకు కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ తన కూతురికి హగ్ ఇస్తానంటే ఆ పాప వద్దు అందట. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్‌లో పోస్ట్ చేసారు. “” నా కూతురిని రాహుల్ హగ్ చేసుకుంటానంటే వద్దు అంది. అప్పుడు రాహుల్ నీకు నచ్చకపోతే హగ్ చేసుకోను. కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. ఈ నాన్న నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు అని చెప్పాడు “” అని చిన్మయి ట్వీట్ చేసింది.
అయితే ట్వీట్‌లో మా కూతురు అని రాయకుండా నా కూతురు అని రాయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయి మీకు మాత్రమే కూతురా? రాహుల్‌కి బిడ్డ కాదా? అంటూ దరిద్రమైన కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చిన్మయికి మహేష్ బాబు కొన్నేళ్ల క్రితం తన కుమారుడు గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్న ట్వీట్‌ని ఫార్వడ్ చేసాడు. ఆ ట్వీట్‌లో మహేష్.. నా కొడుకు గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసుంది. ఆ ట్వీట్‌కి చిన్మయి రిప్లై ఇస్తూ కొందరు ఎదవల నోరుమూయించాలంటే హీరో ఎంట్రీ ఇవ్వాల్సిందే అని కామెంట్ చేసారు.
ఎందుకింత రాద్దాంతం
ఈ చిన్న ట్వీట్ల పట్ల ఎందుకింత రాద్దాంతం అవుతోందంటే.. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల పట్ల అఘాయిత్యాలు ఇంట్లో వారి వల్లే జరుగుతున్నాయి. కన్న కూతురిని తండ్రి రేప్ చేయడం..లేదా బాబాయో మామయ్యో లైంగికంగా వేధించడం వంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ముందు తల్లిదండ్రులే నేర్పాలి అనే ఉద్దేశంతో చిన్మయి ట్వీట్ చేసారు. అది చిరిగి చాటంతయ్యి చాపంత అయ్యిందన్నమాట..!