Chinmayi: ఎక్కువ మందితో సెక్స్ చేస్తే..?
సింగర్ చిన్మయి శ్రీపాద (chinmayi)కొన్ని సార్లు ట్విటర్‌లో పెట్టే డిబేట్లు రచ్చకు దారి తీస్తుంటాయి. గతంలో ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనంగా మారారు చిన్మయి. ఆమె చేసిన ఆరోపణలు నిజమా కాదా అని కూడా తెలుసుకోకుండా కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెపై ఐదేళ్ల పాటు బ్యాన్ విధించింది. అయితే ఇప్పుడు చిన్మయి ట్విటర్‌లో ఓ డాక్టర్‌ను అడిగిన ప్రశ్న వైరల్ అవుతోంది. మల్టిపుల్ సెక్స్ పార్ట్‌నర్స్ గురించి చిన్మయి ఓ డాక్టర్‌ని అడిగిన ప్రశ్న పెద్ద చర్చకు దారితీసింది.
షారుక్ ఖాన్ అభిమాని అయిన ఓ అమ్మాయి వల్ల ఈ రచ్చ అంతా మొదలైంది. ఆ అమ్మాయి ట్విటర్‌లో మల్టిపుల్ సెక్స్ పార్ట్‌నర్స్ ఉంటే ఎంతో మేలని, దాని వల్ల బెడ్‌పై నచ్చని అంశాలు నచ్చే అంశాలు ముందే తెలిసిపోతాయని ట్వీట్ చేసింది. దీని వల్ల వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొంది. ఈ ట్వీట్‌పై ఓ డాక్టర్ కామెంట్ చేసాడు. ఇలాంటి అమ్మాయిలు ఉండే ఇళ్ల నుంచే వేశ్యలు పుట్టుకొస్తారని, వీరికి భగవద్గీత లాంటివి చదివించాలని క్లాస్ పీకాడు. మల్టిపుల్ సెక్స్ పార్ట్‌నర్స్ వల్ల మానసిక, సైకలాజికల్ సమస్యలు వస్తాయని, అలాంటి వాళ్లు మెడికల్‌గా ఫిట్ కాదని తెలిపారు. (chinmayi)
వీరిద్దరి డిబేట్‌లోకి చిన్మయి వచ్చారు. ఆమె ఆ డాక్టర్‌ని ఒక ప్రశ్న అడిగారు. “” ఈ మధ్యకాలంలో డాక్టర్లు ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్స్ ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయా? అదెలా? నిజంగా తెలీక అడుగుతున్నా ప్లీజ్ చెప్పండి “” అని ఆయన్ను ప్రశ్నించారు. ఇందుకు ఆ డాక్టర్ రిప్లై ఇస్తూ.. ఎక్కువ మందితో సెక్స్ చేస్తే లైంగిక అనారోగ్య సమస్యలు వస్తాయని ఈ విషయం తెలీయాలంటే మెడిసినే చదవాలనేం లేదని అన్నారు.
ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయకుండా మళ్లీ ఆ డాక్టర్‌ని ఇంకో ప్రశ్న అడిగారు చిన్మయి. “” నేను అడిగింది అది కాదు. ఎక్కువ మందితో సెక్స్ చేస్తే మెడికల్‌గా అన్‌ఫిట్ అని ఎలా చెప్తారు? ఎందుకు మీరు ఇతరుల సెక్స్ లైఫ్‌ని జడ్జ్ చేస్తున్నారు? అంటే మీరు వేశ్యలను కూడా అవమానిస్తున్నారా? మీరు సమస్య ఏంటో తెలుసుకోకుండానే ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు “” అని మండిపడ్డారు చిన్మయి.