Banglore Rave Party: డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ..చార్జ్‌షీట్ ఫైల్ చేసిన పోలీసులు
Banglore Rave Party: నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్టుల్లో తేలింది. దాంతో బెంగళూరు పోలీసులు ఆమెపై చార్జ్‌షీట్ నమోదు చేసారు. హేమతో పాటు మరో 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా తేలింది. వారిపై కూడా చార్జ్‌షీట్ నమోదైంది.
అసలేం జరిగింది?
మే నెలలో బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఓ ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు కావడంతో సెలబ్రిటీలను పిలిచి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఎంట్రీ టికెట్ ఏకంగా రూ.50 లక్షలట. అయితే.. తాను బర్త్‌డే పార్టీ అని పిలిస్తే వెళ్లానే తప్ప అక్కడ డ్రగ్స్ ఉన్నాయన్న సంగతి తనకు తెలీదని.. తన బ్లడ్ సాంపుల్స్ కలెక్ట్ చేయకముందే కొందరు మీడియా వర్గాలు హేమ డ్రగ్స్ తీసుకున్నారు అంటూ రాసేసారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
రెండు నెలల క్రితం తనకు బ్లడ్ టెస్ట్ చేసారని.. అందులో నెగిటివ్ అనే వచ్చిందని.. అదే కాకుండా తాను కూడా స్వయంగా వెళ్లి మరీ చెకప్ చేయించుకున్నానని ఆ రిపోర్ట్‌లో కూడా నెగిటివ్ అనే ఉందని వెల్లడించారు. బహిరంగంగానూ అన్ని వైద్య పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
“” రేవ్ పార్టీ ఘటన అనంతరం నాపై మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి. కావాలనే మీడియా నాపై దుష్ప్రచారం చేసింది. నేను అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాను. డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. బహిరంగంగా పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధం. నాకు కొందరు మీడియా పెద్దలు ఫోన్లు చేసి సెటిల్మెంట్లకు రావాలని రాజీ పడాలని కాల్స్ చేస్తున్నారు. నేను ఏ తప్పూ చేయనప్పుడు నేనెందుకు రాజీ పడాలి? నాకు మీడియాతో ఎలాంటి విభేదాలు లేవు. ఆరోజు నాకు వైద్య పరీక్షలు జరగకపోయినా డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిందని రాసేసారు. దాంతో నేను ఆవేదనతో అలా ఎలా రాస్తారు అని అడిగినందుకు హేమ పొగరు, ఓవరాక్షన్ చేస్తోంది అని రాసేసారు. అందుకే నేను రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాను “” అని తెలిపారు.