Chandrahaas: దేవర కంటే నా సినిమానే బాగుందంటున్నారు
Chandrahaas: ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ నటించిన రామ్‌నగర్ బన్నీ సినిమా మొన్న రిలీజ్ అయ్యింది. ఇది చంద్రహాస్ నటించిన రెండో సినిమా. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ చంద్రహాస్‌ను ఓ ప్రశ్న అడిగాడు. సర్ దేవర కంటే మీ సినిమానే బాగుందనే టాక్ విన్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడతారేమో కదా అని అడిగాడు. దీనికి చంద్రహాస్ తెగ ఫీలైపోతూ సమాధానమిచ్చాడు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడితే నేనేం చేయలేను. ఎందుకంటే నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే. దేవర కంటే నా సినిమానే బాగుంది అని ప్రేక్షకులు మాట్లాడుకోవడం నేను కూడా విన్నాను అన్నాడు. దాంతో ఎక్కడ ఈ విషయం మళ్లీ మరో కాంట్రవర్సీకి దారి తీస్తుందో అని పక్కనే ఉన్న ప్రభాకర్ వెంటనే మైక్ లాక్కుని కవర్ చేసే యత్నం చేసారు. సర్ మీరు అలా కంపేర్ చేయడం బాలేదు. మీ పోలిక ఎలా ఉందంటే.. తిరుమలకు రోడ్డు మీద ఉండే ఆలయానికి ఉండేంత తేడా ఉంది. రోడ్డు మీద ఆలయానికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్లచ్చు. కానీ తిరుమలకు వెళ్లడం అంత ఈజీ కాదు. కాబట్టి దయచేసి రెండు సినిమాలను పోల్చకండి అన్నారు.