Chaitanya మానసికంగా బాధపడ్డారా?
Hyderabad: నాగబాబు కూతురు నిహారిక కొణిదెలను (niharika konidela) పెళ్లి చేసుకున్న చైతన్య జొన్నలగడ్డ (chaitanya) మానసికంగా బాధపడ్డారా? ఆయన పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే అదే అనిపిస్తోంది. చాలా కాలంగా నిహారిక, చైతన్య జీవితంలో గొడవలు జరుగుతున్నాయి. ఈరోజే వీరిద్దరూ అఫీషియల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు కూడా. అయితే ఈ ఘటన వల్ల చైతన్య (chaitanya) ఎంతో డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే కొన్ని రోజుల క్రితం ఆయన మహారాష్ట్రలోని గ్లోబల్ విపాసన పగోడాకు వెళ్లారు. ఆ విపాసనను అలవాటు చేసుకోవడానికి పది రోజులు కష్టపడ్డానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. తనను ఇక్కడికి పంపినవారికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక చోటికి వెళ్లినప్పుడు దాని నుంచి కావాల్సిన జ్ఞానం పొందే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే చాలా రోజులుగా చైతన్య మానసికంగా ఎంతో వేదనకు గురైనట్లు తెలుస్తోంది.