Celina Jaitly: చిన్నపిల్లనని కూడా చూడకుండా.. ప్రైవేట్ భాగాలను చూపించాడు
Celina Jaitly: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కలకత్తా మెడికో హత్యాచార ఘటన నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రిటీలు తమ పట్ల జరిగిన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. మెడికోపై రేప్, మర్డర్ జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆడవాళ్లు మగవాళ్లతో మాట్లాడటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఆమె వ్యాఖ్యానించడం మరింత దుమారానికి దారి తీసింది. ఇలాంటి ఘటనే తనకు చిన్నప్పుడు ఎదురైందని అన్నారు బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ.
తాను స్కూల్‌లో చదువుతున్నప్పటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఇలా అన్నారు. “” తప్పు ఎప్పుడూ కూడా బాధితులదే. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్ పక్కనే ఓ యూనివర్సిటీ ఉండేది. అక్కడ అబ్బాయిలు స్కూల్ అయిపోయే సమయానికి బయటే ఉండేవారు. నేను వస్తుంటే కామెంట్స్ చేసేవారు. నేను వెళ్లే రిక్షాను ఫాలో అయ్యేవారు. నేను పట్టించుకోవడం లేదని రాళ్లు విసిరేవారు. ఓసారి నేను స్కూల్‌కి వెళ్తుంటే ఓ అబ్బాయి నా ముందే తన ప్యాంట్ విప్పి తన ప్రైవేట్ భాగాలను చూపించాడు. నేను వెంటనే స్కూల్ టీచర్‌కు కంప్లైంట్ చేసాను. ఆమె అంతా విని తప్పు నాదే అంది. నేను మోడ్రన్ డ్రెస్ వేసుకుని స్కూల్‌కి రావడం.. జుట్టుకి నూనె పెట్టుకోకుండా రెండు జడలు వేసుకోకపోవడం వల్లే నా పట్ల ఇలా జరిగిందిని అన్నారు. ఈ మాటలు నన్ను కొన్ని సంవత్సరాల పాటు వేధించాయి “” అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.