HBD NTR: అలలకు అలుపు లేదు నీ నటనకు తిరుగులేదు!

Hyderabad: మ్యాన్​ ఆఫ్​ మాస్​, గాడ్​ ఆఫ్​ మాస్​, సీఈవో ఆఫ్​ మాస్​.. పేర్లెన్నయినా వాటికి చిరునామా మాత్రం యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​(Jr NTR). ఈ రోజు (మే 20న) ఎన్టీఆర్​ బర్త్​డే సందర్భంగా నెట్టింట అభిమానులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తారక్​ బర్త్​డే ట్రీట్​గా కొరటాల శివ అందించిన సర్​ప్రైజ్​ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్​ 30 సినిమాకు ‘దేవర’(Devara) టైటిల్​ని ఫిక్స్​ చేస్తూ తారక్​ లుక్​ రిలీజ్​ చేశారు. ఈ లుక్​ చూసిన ఫ్యాన్స్​ ఎన్టీఆర్​ ఖాతాలో మరో హిట్​ ఖాయం అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

ఇక, ఎన్టీఆర్​ బర్త్​డే విషెస్​ తో పాటు దేవర టీమ్​కి అభినందనలు చెబుతున్నారు. నటసింహం బాలకృష్ణ దేవర పోస్టర్​ ట్వీట్​ చేసి ‘బాగుంది అబ్బాయ్​’ అంటూ అభినందించారు. మ్యూజిక్​ డైరెక్టర్​ థమన్​ దేవర టీమ్​కి స్పెషల్​ విషెస్​ చెప్పారు. బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ తెలుగులో ట్వీట్​ చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ బాలీవుడ్​ ఎంట్రీ సినిమా వార్​2లో తారక్​ది విలన్​ రోల్​ అని హృతిక్​ ట్వీట్​తో కన్ఫామ్​ అయిపోయింది. ‘యుద్దభూమిలో కలిసేందుకు వేచి చూస్తున్నా.. నన్ను కలిసే వరకు సంతోషంగా నీ రోజులు సాగిపోనివ్వు’ అంటూ ట్వీట్​ చేశారు హృతిక్​. ఇక, దేవర టైటిల్​ నాదే అంటూ ట్వీట్​ చేసిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్​. ఇది మన యంగ్​ టైగర్​ సినిమాకే కదా.. ఆయన కూడా నాకు దేవరే’ అంటూ వివాదానికి పుల్​స్టాప్​ పెట్టేశారు. అంతేకాదు ఎన్టీఆర్​30 ఫస్ట్​లుక్​ పోస్టర్​ ‘సూపర్​గా ఉంది’ అంటూ ట్వీట్​ చేశారు.

మహేష్​ బాబు, రాశి కన్నా, రష్మికా మందన్నా, మోక్షజ్ఞ తేజ, ఖుష్బూ, రామ్​ పోతినేని, భూమికా చావ్లా​… టాలీవుడ్​ సెలబ్రిటీలు, ప్రముఖులతోపాటు జపాన్​లోని తారక్​ అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.