Malli Pelli: నరేష్‌కి ఊరట
Hyderabad: ప్రముఖ నటుడు వీకే నరేష్‌కి (vk naresh) ఊరట లభించింది. మళ్ళీ పెళ్లి (malli pelli) విడుదలపై దాఖలైన కేసును సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు నరేష్ ఇంట్లోకి అతని భార్య రమ్య రఘపతిపై (ramya raghupathi) నిషేధం కూడా విధించింది. సినిమాలో తన క్యారెక్టర్‌ను తప్పుగా చూపించి నరేష్ పరువు తీసారని, ఆ సినిమాను OTTలో ప్రసారం చేయడకుండా బ్యాన్ చేయాలని రమ్య రఘుపతి కోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సినిమా ఆహాలో (aha) ప్రసారం అవుతోంది.