Bunny Vas: మెగా ఫ్యామిలీలో నా ప‌రిస్థితి ఏం బాలేదు

Bunny Vas says mega and allu family must meet for a dinner

Bunny Vas:  మెగా ఫ్యామిలీలో త‌న ప‌రిస్థితి ఏమీ బాలేద‌ని అన్నారు నిర్మాత బ‌న్నీ వాసు. మిక్సీలో క్యారెట్ ముక్కలా త‌న ప‌రిస్థితి అయిపొయిందని ఏ బ్లేడ్ వచ్చి ఎప్పుడు కొస్తుందో తెలీదు కానీ బయటకి జ్యూస్ మాత్రం వస్తోంద‌ని సెటైర్ వేసారు. మెగా, అల్లు కుటుంబం అంతా కలిసి ఒక డిన్న‌ర్ చేస్తే అంతా సెట్ అయిపోతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అల్లు అర్జున్ జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు తెలప‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం ద‌గ్గ‌ర్నుంచి మెగా, అల్లు కుటుంబంలో అగ్గి రాజుకుంది. ఇప్ప‌టికీ ఆ జ్వాల‌లు ఇంకా రగులుతూనే ఉన్నాయ‌ని టాక్. వారంతా ఒక డిన్న‌ర్ చేస్తే అంతా సెట్ అవుతుంద‌ని బ‌న్నీ వాస్ అభిప్రాయ‌ప‌డ్డారు.