Pawan Kalyan: OG షూటింగ్ పిక్.. కిక్ ఎక్కించే లుక్!

Hyderabad: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) న‌టిస్తున్న ఓజీ(og) సినిమాలోని మ‌రో పిక్ బ‌య‌టికి వ‌చ్చింది. సుజీత్(sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే బోలెడు బీటీఎస్ (బిట్వీన్ ది షూట్) పిక్స్ చాలా బ‌య‌టికి వ‌చ్చాయి. అవ‌న్నీ లీక్ అవుతున్న పిక్స్ కూడా కాదు. ఓజీ టీం కావాల‌నే హైప్ క్రియేట్ చేయ‌డానికి వాటిని రిలీజ్ చేస్తున్న‌ట్లుంది. ఇకపోతే ఈరోజు షూటింగ్ స‌మ‌యంలో తీసిన ఫొటోని ప‌వ‌న్ క‌ళ్యాణే ట్విట‌ర్లో షేర్ చేసారు. మ‌హారాష్ట్రలోని వాయ్ స‌ర‌స్సు వ‌ద్ద తీసిన ఫొటో అని తెలిపారు. అక్క‌డ రాజ‌మండ్రికి చెందిన జ‌న‌సైనికుల‌ను క‌లుసుకున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. ప‌వ‌న్ స‌ముద్రం వైపు చూస్తూ నిల‌బ‌డిన ఆ పిక్ చూస్తుంటే గూస్‌బంప్స్ వ‌స్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆయ‌న క‌రాటే చేసే స‌న్నివేశాలు కూడా ఇందులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియాంక అరుళ్ మోహ‌న్(priyanka arul mohan) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.