హీరోయిన్‌తో బ్ర‌హ్మాజీ పులిహోర‌.. ప్లాటినం లెగ్ అట‌!

Hyderabad: ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ బ్ర‌హ్మాజీ(brahmaji) త‌న కామెడీ టైమింగ్‌తో ఎంద‌రో అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న ఇండ‌స్ట్రీలో టాప్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌లో ఒక‌రు. బ‌హుశా ఆయ‌న కూడా మీమ్స్ బాగా ఫాలో అవుతారేమో. ఏ మీమ్ ఎప్పుడు ట్రెండ్ అవుతున్నా వాటిని ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్‌లోనో లేక ట్విట‌ర్ లోనో వాడేస్తుంటారు. అయితే.. బ్ర‌హ్మాజీ గారూ స‌ర‌దాగా హీరోయిన్‌తో పులిహార క‌లిపేస్తున్నారు. సాయి ధ‌రమ్ తేజ్ (sai dharam tej)హీరోగా విరూపాక్ష(virupaaksha) సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సంయుక్త(samyukta) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఆమె క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసారు. ట్రైల‌ర్ ఎలా ఉందో చెప్పండి అని ఫ్యాన్స్‌ని అడిగారు. దీనికి బ్ర‌హ్మాజీ స్పందిస్తూ.. చాలా బాగుంది.. ప్లాటినం లెగ్ గారూ అని స‌ర‌దాగా కామెంట్ చేసారు. ఇందుకు సంయుక్త .. అరే…బ్ర‌హ్మాజీ గారూ.. అని స‌ర‌దాగా రిప్లై ఇచ్చారు. అంటే తెలుగులో సంయుక్త చేసిన సినిమాల‌న్నీ హిట్టే. అందుకే ఆమెను గోల్డెన్ లెగ్ అని కాకుండా ఏకంగా అంత‌కంటే విలువైన ప్లాటినంతో పోల్చారు బ్ర‌హ్మాజీ(brahmaji)