Boney Kapoor: జాహ్నవి పెళ్లికి ముందే పుట్టలేదు
అలనాటి తార శ్రీదేవితో (sridevi) తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు నిర్మాత బోనీ కపూర్ (boney kapoor). తనకు శ్రీదేవికి పెళ్లి ఎప్పుడైందో తెలీక చాలా మంది మీడియా వర్గాలు పెద్ద కూతురు జాహ్నవిని (janhavi kapoor) పెళ్లి ముందే కన్నామని రాస్తున్నారని అందులో నిజం లేదని స్పష్టం చేసారు.
“” 1996లో నేను శ్రీదేవి రహస్యంగా షిరిడీలో పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత 1997లో మీడియా ముందు మరోసారి పెళ్లి చేసుకున్నాం. రెండోసారి పెళ్లి చేసుకున్న సమయానికి శ్రీదేవి గర్భం దాల్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకే జాహ్నవి పుట్టింది. దాంతో అంతా పెళ్లికి ముందే శ్రీదేవి జాహ్నవికి జన్మనిచ్చింది అని రాసేసారు. శ్రీదేవికి భక్తి ఎక్కువ. తన పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి శ్రీదేవి కాలినడకన తిరుమల కొండ ఎక్కేది. నాకు అనారోగ్యంగా ఉంటే శ్రీదేవి జుహు నుంచి సిద్ధి వినాయక ఆలయానికి కాలి నడకన వెళ్లి మొక్కుకునేది. ఇప్పుడు జాహ్నవి కూడా అంతే. ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది.
ఇక శ్రీదేవి గుండెపోటుతో బాత్‌టబ్‌లో పడి చనిపోవడానికి కారణం తను తీసుకునే డైట్ వల్లే. నాజూగ్గా కనిపించేందుకు ఎక్కువగా తినకుండా ఉండేది. దుబాయ్‌లో ఉన్నప్పుడు కూడా అంతే. దాంతో రోజులో ఒకటి రెండు సార్లు కళ్లు తిరిగి పడిపోతుండేది. దుబాయ్ హోటల్‌లో జరిగింది కూడా ఇదే. బాత్‌టబ్ పక్కన నిలబడినప్పుడు శ్రీదేవికి కళ్లు తిరిగాయి. అలా నీళ్లు నిండుగా ఉన్న టబ్‌లో పడిపోయింది. స్పృహ కోల్పోవడం వల్ల నీటిలో ఊపిరాడక హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది “” అని వెల్లడించారు బోనీ కపూర్. (boney kapoor)