OG: పవర్​స్టార్​ సినిమాలో విలన్​గా బాలీవుడ్​ హీరో!

Hyderabad: పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)‌ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ (OG). సాహో ఫేం సుజిత్‌(Sujeeth) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్​ ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. కాగా, తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్​ నెట్టింట వైరల్​గా మారింది. ఈ సినిమాలో విలన్​గా బాలీవుడ్​ స్టార్​ హీరో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాదిన రూపొందుతున్న చాలా సినిమాల్లో బాలీవుడ్(Bollywood)​ స్టార్లు రకరకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ సినిమాలోనూ విలన్​ క్యారెక్టర్​ కోసం ఓ స్టార్​ హీరోని సంప్రదించిందట చిత్రబృందం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక, పవన్ ఈ సినిమాలో స్టైలిష్​ లుక్​లో కనిపించనున్నట్లు నెట్టింట హల్‌ చల్ చేస్తున్న స్టిల్స్‌ చూస్తుంటే తెలిసిపోతోంది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ (Priyanka Arul Mohan) పవన్​కి జోడీగా నటిస్తోంది. ఓజీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ వినోదయ సీతమ్ రీమేక్‌ (PKSDT) బ్రో:ది అవతార్(BRO: The Avatar)​తో పాటు, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) ఫస్ట్‌ గ్లింప్స్ ట్రెండింగ్‌లో నిలుస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. వీటితోపాటు క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందుతున్న హరిహరవీరమల్లు కూడా సెట్స్​పై ఉంది. వీటితోపాటు మరో రెండు సినిమాలకీ పవన్​ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.