Devara: “వారు ఎన్టీఆర్ అభిమానులు కారు పెయిడ్ ఆర్టిస్ట్‌లు”

bollywood journalist says jr ntr fans are paid

Devara: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌పై బాలీవుడ్‌కి చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. తార‌క్ న‌టించిన దేవ‌ర ట్రైల‌ర్ నిన్న ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ వేడుక‌కు ఎన్టీఆర్ కూడా హాజ‌ర‌య్యారు.

అయితే ట్రైల‌ర్ రిలీజ్ అయిన స‌మ‌యంలో అక్క‌డున్న మీడియా వ‌ర్గాలను ట్రైల‌ర్ స‌రిగ్గా చూడ‌నివ్వ‌కుండా విన‌నివ్వ‌కుండా అక్క‌డే ఉన్న కొంద‌రు ఎన్టీఆర్ అభిమానులు గట్టిగా కేక‌లు వేసార‌ట‌. దాంతో అక్క‌డున్న జ‌ర్న‌లిస్ట్‌లకు ట్రైల‌ర్‌లోని డైలాగులు వినిపించ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. పైగా యాంక‌ర్ కేవ‌లం త‌న‌కు న‌చ్చిన నాలుగు ప్ర‌శ్న‌లు అడిగి వెళ్లిపోయాడ‌ని.. ట్రైల‌ర్ గురించి ప‌లు ప్ర‌శ్న‌లు వేసేందుకు ఇత‌ర జ‌ర్న‌లిస్ట్‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని మండిపడ్డారు. అక్క‌డున్న అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కార‌ని.. వారిని డ‌బ్బులు ఇచ్చి నియ‌మించార‌ని ఈ విష‌యం తాను కచ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. అభిమానులు అలా అరుస్తుంటే కాసేపు సైలెంట్‌గా ఉండండి అని ఎన్టీఆర్ కూడా వారిని హెచ్చ‌రించ‌క‌పోవ‌డం బాధాక‌రం అని అభిప్రాయ‌ప‌డ్డారు.