Galwan అంశంపై సినిమా తీయనున్న బాలీవుడ్​ డైరెక్టర్​!

Hyderabad: భారత దేశ (India) సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అది పాకిస్తాన్ (Pakistan) అయినా చైనా (China) అయినా సరే. అయితే, ఇటీవల కాలంలో గాల్వాన్‌ లోయలో చైనా బోర్డర్ వద్ద ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాం. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చైనా ప్లాన్ చేస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గాల్వాన్ అంశంపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు దర్శకుడు అపూర్వ లఖియా.

2020లో గాల్వాన్ (Galwan) బోర్డర్ వద్ద జరిగిన అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే గాల్వాన్ సమస్యపై పలువురు పుస్తకాలు రాసి విడుదల చేశారు. ప్రముఖ జర్నలిస్టులు శివ్‌ అరోరా, రాహుల్ సింగ్ రాసిని ఇండియాస్ మోస్ట్ ఫియర్‌‌ లెస్‌3 అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు సినిమాను తెరకెక్కించనున్నారు అపూర్వ లఖియా (Apoorva Lakhia).

‘షూట్ అవుట్ యెట్ లోఖండ్ వాలా’ (Shootout at Lokhandwala) వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా ఈ సినిమాను దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాలో 2020 సంవత్సరంలో గాల్వాన్ లో పరిస్థితులు, సమస్యలు, మన ఇండియన్ ఆర్మీ, ప్రభుత్వం చైనాను ఎలా ఎదుర్కొంది, ఆర్మీ చూపించిన ధైర్య సాహసాలను చూపించనున్నారు. ఇటీవలే ఆర్మీ నుంచి పర్మిషన్ కూడా తీసుకొని డైరెక్టర్ అపూర్వ లఖియా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.