అల్లు అర్జున్​ సరసన ఛాన్స్​ కొట్టేసిన బాలీవుడ్​ బ్యూటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి భాగం సూపర్‌‌ హిట్‌ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపించింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన పుష్ప(Pushpa).. భారీ క్రేజ్‌ను అందుకున్న విషయం తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడింది. చిత్ర యూనిట్ ఇటీవలే పుష్ప2 సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది.
పుష్ప2(Pushpa 2) సినిమాకు సంబంధించిన ప్రత్యేక వీడియో మరియు పోస్టర్ రిలీజ్ చేశారు. వాటితో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటించబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. అయితే పుష్ప2 సినిమాలో మాత్రం కాదు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) ఒక సినిమా చేయబోతున్నట్టు అందరికి తెలిసిందే.
ఈ మూవీలో బన్నీకి హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మృణాల్ బాలీవుడ్ హీరోయిన్ కావడం, సీతారామం సినిమాతో సౌత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవడం, కథ పరంగా కూడా ఈ చిత్రానికి మృణాల్ అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట.
ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో యానిమల్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. పుష్ప2 షూటింగ్ కూడా ఆ సమయానికి పూర్తి కానుంది. ఆ వెంటనే సందీప్, బన్నీల సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్‌ ప్రకటించనుందని తెలుస్తోంది.