షారుఖ్​ వారసుడి ఎంట్రీ..హీరోగా మాత్రం కాదు!

Mumbai: బాలీవుడ్(Bollywood) బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) వారసుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాళ్లంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ శుభవార్త వచ్చింది. తండ్రి వారసత్వంతోపాటు పోలికలు కూడా ఆర్యన్‌ కు దాదాపుగా వచ్చాయి. ఈ యంగ్ ఎనర్జిటిక్ కుర్రాడికి సరైన కథలు, దర్శకులు వస్తే త్వరగా స్టార్ డమ్ దక్కించుకునే అవకాశాలున్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

షారుఖ్ ఖాన్‌ కూడా ఆ మేరకు రంగం సిద్ధం చేశారని టాక్. అయితే ఆర్యన్‌ ఖాన్‌ ను సినిమాతో కాకుండా వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ డం (Stardom) అనే టైటిల్ తో ఆరు ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. సినీ రంగ నేపథ్యంగా తెరకెక్కుతున్న స్టార్ డం సిరీస్‌లో ఆర్యన్ ఖాన్ కేవలం నటించడమే కాదు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. తన తెరంగేట్రాన్ని సూచిస్తూ డిసెంబర్ లోనే సోషల్ మీడియా వేదికగా ఆర్యన్ ఒక ఫోటో షేర్ చేశాడు. కానీ వివరాలు మాత్రం వెల్లడించలేదు.

అప్పటికే స్టార్ డం షూటింగ్ మొదలైంది. అయితే ఆ విషయం మీడియాకు తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చిన షారుఖ్.. త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా స్టార్ డం సిరీస్‌ తోపాటు వారసుడి వెండి తెర ఎంట్రీని కూడా ప్రకటించనున్నారు. ఈ సంగతి బయటికి రావడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది.స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి రావడం కొత్తేమీ కాదు. అయితే ఒకేసారి యాక్టర్‌‌గా డైరెక్టర్‌‌గా ఎంట్రీ ఇస్తుండడం మాత్రం కొంచెం సర్‌‌ ప్రైజ్ అనే చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్, అనిల్ కపూర్, శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్లు కూతుళ్లను మాత్రమే తెర మీరకు తీసుకొచ్చారు.