సెక్స్ సీన్ చేద్దాం అని అడిగేదాన్ని: నటి బోల్డ్ కామెంట్స్
Mumbai: బాలీవుడ్ నటి కుబ్రా సైత్(kubbra sait) చేసిన బోల్డ్ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖితో(nawazuddin siddiqui) కలిసి కుబ్ర సేక్రెడ్ గేమ్స్(sacred games) అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించారు. అయితే ఆ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“అనురాగ్ కశ్యప్‌పై నమ్మకంతో సేక్రెడ్ గేమ్స్‌లో నటించడానికి ఒప్పుకున్నా. అందులో నాది ట్రాన్స్‌జెండర్ పాత్ర. నవాజుద్దిన్ సిద్దిఖితో కలిసి సెక్స్ సీన్లో నటించాల్సి వచ్చింది. అయితే ఆ సీన్ సరిగ్గా రావడానికి ఏడు సార్లు షూట్ చేయాల్సి వచ్చింది. ఏడోసారి సీన్ అవ్వగానే నేను నేల మీద పడి ఇంక నావల్ల కాదు అని ఏడ్చేసాను. అప్పుడు అనురాగ్, నవాజుద్దిన్ అని ఎంతో ఓదార్చారు. నవాజుద్దిన్ ఎంతో మంచి వ్యక్తి. సెట్స్‌లో నేను చాలాసార్లు ఆయన వద్దకు వెళ్లి బుగ్గపై ముద్దిచ్చి సెక్స్ సీన్స్‌లో నటిద్దాం రా అని అడిగేదాన్ని. తప్పుగా అనుకోకండి. ఓ నటిగా సెట్స్‌లో కంఫర్టబుల్‌గా ఉండటానికే నేను అలా చేసాను” అని తెలిపారు కుబ్రా.