Bigg Boss: హిందీ బిగ్‌బాస్‌లో తెలుగులో మాట్లాడుకుంటున్న కంటెస్టెంట్లు

స‌ల్మాన్ ఖాన్ (salman khan) హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ షోలో (bigg boss) న‌టి మ‌న్నారా చోప్రా (mannara chopra) కూడా పాల్గొన్నారు. అయితే మ‌న్నారాతో పాటు హైద‌రాబాదీ యువ‌కుడు అరుణ్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నాడు. అయితే ఓ టాస్క్ స‌మ‌యంలో మ‌న్నారా అరుణ్ చ‌ర్చించుకుంటూ మ‌ధ్య‌లో తెలుగులో మాట్లాడుకున్నారు. వీరి మాట‌లు విన్న‌ బిగ్ బాస్ వెల్కం టు తెలుగు బిగ్ బాస్ అని చెప్ప‌డం సంద‌డిగా మారింది. హిందీలో కూడా తెలుగు డామినేష‌న్ ఎక్కువ‌గానే ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.