Raj Tarun Lavanya Case: రాజ్‌త‌రుణ్ కేసులో బిగ్ ట్విస్ట్

big twist in raj tarun and lavanya case

Raj Tarun lavanya Case: ప్ర‌ముఖ న‌టుడు రాజ్ త‌రుణ్‌.. అత‌ని మాజీ ప్రియురాలు లావ‌ణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. లావ‌ణ్య మాజీ ప్రియుడైన మ‌స్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. వ‌ర‌ల‌క్ష్మి టిఫిన్స్ డ్ర‌గ్స్ కేసులో భాగంగా పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేసారు. రాజ్ త‌రుణ్ త‌న‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మ‌రో హీరోయిన్ కోసం త‌న‌ను మోసం చేసాడంటూ నెల రోజుల క్రితం లావ‌ణ్య పోలీసుల‌ను సంప్ర‌దించింది.

దాంతో పోలీసులు రాజ్ త‌రుణ్‌పై కేసు న‌మోదు చేసారు. ఆ త‌ర్వాత రాజ్ త‌రుణ్ కూడా లావ‌ణ్య త‌న‌ను మాన‌సికంగా హింసించ‌ద‌ని.. గ‌తంలో ఆమె డ్ర‌గ్స్ కేసులోనూ అరెస్ట్ అయ్యింద‌ని తెలిపాడు. ఇప్పుడు లావ‌ణ్య మాజీ ప్రియుడు మ‌స్తాన్ సాయి డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది.