Bichagadu 2: కన్నీళ్లు తెప్పిస్తున్న ‘చెల్లి వినవే’ పాట!
తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) ‘బిచ్చగాడు’(Bichagadu) సినిమాతో టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన బిచ్చగాడు(Bichagadu) తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తరువాత విజయ్ ఆంటోనీ(Vijay Antony) నటించిన అన్ని సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ, ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ మాత్రం మిగతా సినిమాలు అందుకోలేదు. ఇక ఇప్పుడు మరోసారి ‘బిచ్చగాడు-2’(Bichagadu 2) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్(Vijay Antony) .
ఇప్పటికే బిచ్చగాడు-2 సినిమాపై తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటం మరింత ఆసక్తికర విషయం. ఈ సినిమా నుండి తాజాగా రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘చెల్లి వినవే..’ అంటూ సాగిన ఈ పాట అన్నాచెల్లి బంధాన్ని చాలా చక్కగా వివరించింది. ఇక ఈ పాటను అనురాగ్ కుల్కర్ణి పాడిన తీరు ప్రతిఒక్కరినీ కదిలించే విధంగా ఉంది.
ఈ పాటను పూర్తి ఎమోషనల్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ(Vijay Antony) మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.