“భువన విజ‌యం”తో వ‌స్తున్న సునీల్

ప్రస్తుతం టాలీవుడ్​లో మాస్​, యాక్షన్​తో కేకలు పెట్టించే సినిమాలేగానీ, కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలే కరువయ్యాయి. కొన్ని సినిమాల్లో కామెడీ ట్రాక్​లు ఉన్నా అదీ అంతంత మాత్రమే. అయితే చాలా రోజుల తర్వాత పూర్తి కామెడీ సినిమాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది ‘భువన విజయం’. ఈ సినిమా ఫస్ట్​లుక్​ని డైరెక్టర్​ వెంకీ ఉడుగుల ఈరోజు విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత ఎక్కువ సంఖ్యలో కమెడియన్లు ఒక ఫ్రేములో కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ప్రముఖ కమెడియన్స్ సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ లాంటి నటులు ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా ‘భువన విజయమ్’.  కమెడియన్​గా నవ్వించి హీరోగా మెప్పించలేకపోయిన సునీల్​ మళ్లీ కమెడియన్​గా ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.  సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో విలన్​గానూ మెప్పించాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు సునీల్​. ఇక, ఈ సినిమాలో సునీల్​, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాగా తెరెక్కుతున్న దీనికి భువన విజ‌యం అనే మాంచి టైటిల్ పెట్టారు. దీనికి యలమంద చరణ్ దర్శకుడు. ఇటు సునీల్, వెన్నెల కిషోర్ లతో పాటు కమెడియన్లు శ్రీనివాసరెడ్డి, ధనరాజ్, వైవా హర్ష, పృధ్వీ కూడా వున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. టోటల్ స్టార్ కాస్ట్ అంతా సీరియస్​ లుక్ లో కనిపిస్తున్నారు. పైగా ఒక్కొక్కరు ఒక్కో వైవిధ్యమైన ఎక్స్ ప్రెషన్ తో కనిపించడం సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. మొత్తం మీద ఓ చిన్న సినిమాకు అట్రాక్షన్ వచ్చేలా ఫస్ట్ లుక్ ని ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందో లేదో తెలియాలంటే వేసవి వరకు ఆగాల్సిందే!