Prabhas పై టాప్ ప్రొడ్యూస‌ర్ కామెంట్స్.. నిజ‌మేనా?

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) రేంజ్ ఇది అంటూ టాప్ హిందీ ప్రొడ్యూస‌ర్ భూష‌ణ్ కుమార్ (bhushan kumar) చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. భూష‌ణ్ కుమార్‌కు చెందిన టీ సరీస్ (t-series) సంస్థ ప్ర‌భాస్‌తో స్పిరిట్ (spirit) అనే మూవీ తీస్తోంది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) డైరెక్ష‌న్ చేస్తున్నారు. అయితే ప్ర‌భాస్ (prabhas) సినిమా క‌లెక్ష‌న్ల గురించి భూష‌ణ్ కుమార్ స్పందిస్తూ.. ప్ర‌భాస్ ఫ్లాప్ సినిమాకు వ‌చ్చే క‌లెక్ష‌న్స్‌.. బాలీవుడ్‌లో ఒక సినిమా హిట్ క‌లెక్ష‌న్స్‌తో స‌మానం అని అన్నారు. అయితే ఎన్నో బాలీవుడ్ సినిమాల‌ను తీసిన టీ సిరీస్ సంస్థ అధినేత అయిన భూష‌ణ్ కుమార్ (bhushan kumar) ఇలాంటి కామెంట్స్ చేయ‌డం నార్త్ వారికి న‌చ్చ‌డంలేదు. ఒక సౌత్ హీరోతో సినిమా చేస్తున్నంత మాత్రాన హిందీ సినిమాను త‌క్కువ చేసి మాట్లాడ‌టం స‌రికాద‌ని కామెంట్లు పెడుతున్నారు.