Bhola Shankar హిందీలోనూ..చిరుకి డ‌బ్బింగ్ చెప్పేది ఆయ‌నే!

మెహ‌ర్ ర‌మేష్ (meher ramesh) డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టించిన భోళా శంక‌ర్ (bhola shankar) సినిమాను హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. మ‌న దగ్గ‌ర ఫ్లాప్ అయిన సినిమాల‌కు హిందీలో బాగా వ్యూస్ వస్తాయి. తెలుగులో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమాను హిందీలో డ‌బ్బింగ్ చేసి ఆగస్ట్ 25న రిలీజ్ చేయ‌నున్నారు. హిందీ వెర్ష‌న్‌ను బాలీవుడ్‌కి చెందిన RKD స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది. సినిమాలో చిరంజీవి వాయిస్‌కు బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ (jackie shroff) డబ్బింగ్ చెప్ప‌నున్నార‌ట‌.

ఇక భోళా శంకర్ (bhola shankar) సినిమా త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వేదాళం (vedalam) రీమేక్ అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందులో అజిత్, శ్రుతి హాస‌న్, ల‌క్ష్మీ మేన‌న్ మెయిన్ రోల్స్‌లో న‌టించారు. తెలుగులో చిరంజీవి, త‌మ‌న్నా, కీర్తి సురేష్ న‌టించారు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఈ వేదాళం సినిమాను బెంగాలీలో కూడా రీమేక్ చేసార‌ట‌. అక్క‌డ ఈ సినిమాను సుల్తాన్ ది సేవియ‌ర్ అనే టైటిల్‌తో రీమేక్ చేసారు.