Bhola Shankar: అనుకున్న సమయానికే!

Hyderabad: మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్​’(Bhola Shankar).మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళం(Vedalam)కు రీమేక్‌ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. షాడో తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్​తో మెహర్ రమేష్‌ మళ్లీ మెగాఫోన్‌ పట్టాడు. తమన్నా(Tamannah Bhatia) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌(Keerthy Suresh) చిరుకు చెల్లెలుగా కనిపించనుంది. కాగా, ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్​ కానుంది. ఈ విషయం తాజాగా చిత్రబృందం మరోసారి కన్ఫామ్​ చేసి చెప్పింది. ఆలస్యం లేదనీ, చెప్పిన సమయానికే భోళా శంకర్​ రిలీజ్​ అవనుందని క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ప్రమోషన్స్​ కూడా స్టార్ట్​ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్​.

కాగా ఈ సినిమా కోసం మెహర్‌ రమేష్‌ ప్రత్యేకించి కొన్ని సీన్లను ప్లాన్‌ చేస్తున్నాడట. శంకర్‌ దాదా ఎమ్‌బీబీఎస్‌ తరహాలోనే టైటింగ్‌ కామెడీని సృష్టించబోతున్నాడట. మేయిన్‌ ప్లాన్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌తోనే సాగిన.. మెగాస్టార్‌ తాలుకూ కామెడీ పుష్కలంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మెహర్‌రమేష్‌ చిరును స్టైలిష్‌ అవతారంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గాడ్​ ఫాదర్​, వాల్తేరు వీరయ్యతో మంచి కంబ్యాక్‌ ఇచ్చిన చిరు ఈ సినిమాతో అదే సక్సెస్​ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. కాగా, ఈ సినిమాని ఎకె ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై అనిల్​ సుంకర నిర్మిస్తున్నారు.