Vedalam కంటే భోళా శంక‌ర్ బాగుంద‌ట‌!

Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) న‌టించిన భోళా శంక‌ర్ (bhola shankar) సినిమా శుక్ర‌వారం రిలీజ్ కాబోతోంది. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన వేదాళం (vedalam) సినిమాను మెహ‌ర్ ర‌మేష్ (meher ramesh) తెలుగులో భోళా శంక‌ర్‌గా తీసారు. త‌మ‌న్నా (tamanna) హీరోయిన్‌గా న‌టించ‌గా.. కీర్తి సురేష్ (keerthy suresh) చిరుకి చెల్లి క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. ఇక సుశాంత్ అక్కినేని (sushanth akkineni) కీ రోల్ ప్లే చేసారు. అయితే ఈ సినిమాను నిన్న రాత్రి ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు ముఖ్య వ్య‌క్తులు చూసార‌ట‌. వారు చెప్పిన‌దాని ప్ర‌కారం వేదాళం కంటే భోళా శంక‌రే బాగుంద‌ని అన్నార‌ట‌. మెహ‌ర్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫోక‌స్‌తో సినిమా తీసారని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్‌కి న‌చ్చేస్తే అదే హ్యాపీ. పాపం మెహ‌ర్ (meher ramesh) కూడా టాలీవుడ్‌లో హిట్ కొట్టాల‌న్న క‌ల నెర‌వేరిపోతుంది. (bhola shankar)