Allu arjun నీ హెల్ప్ కావాలి.. హీరోయిన్ రిక్వెస్ట్
Hyderabad: నటి భానుశ్రీ మెహ్రా(bhanushree mehra).. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని(allu arjun) సాయం చేయాలని అడిగారు. అల్లు అర్జున్(allu arjun), భానుశ్రీ(bhanushree) కలిసి వరుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే భానుశ్రీకి వరుడు తర్వాత అసలు అవకాశాలు రాలేదు. దాంతో భానుశ్రీ.. యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసారు. ఇందుకు అల్లు అర్జున్ సాయం కోరారు. డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేస్తే ఎవ్వరికీ తెలీదు కాబట్టి మొన్న బన్నీ దసరా టీంకు కంగ్రాట్స్ చెప్తూ చేసిన ట్వీట్‌కి రిప్లై భానుశ్రీ తనకు హెల్ప్ చేయాలని అడిగారు. హే అల్లు అర్జున్.. నా రీసెంట్ యూట్యూబ్ వీడియోని నీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనిపై నీ ఫీడ్‌బ్యాక్, నీ సపోర్ట్ కావాలి. మిగతా నెటిజన్లు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. దయచేసి కాస్త మర్యాదగా కామెంట్స్ పెట్టండి అని రిక్వెస్ట్ చేసారు.
ఇటీవల భానుశ్రీ అల్లు అర్జున్ తనను బ్లాక్ చేసాడని చెప్పింది. మాటిమాటికీ ఏదో పబ్లిసిటీ కోసం అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేస్తుండడంతో టీం ఆమెను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బన్నీ అన్‌బ్లాక్ చేసాడని మళ్లీ భానుశ్రీనే ట్వీట్ చేసింది. ఇలాంటివాటికి అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడం, రియాక్ట్ అవ్వడం లాంటివి చేయడని చెప్పినా కూడా ఆమె వినిపించుకోవడం లేదు. మరి ఈ యూట్యూబ్ చానెల్ రిక్వెస్ట్‌కి బన్నీ ఏమని రిప్లై ఇస్తాడో వేచి చూడాలి.