Bhagavanth Kesari: అన్న దిగిండు..ఇగ మాస్ ఊచకోత షురూ..!

Hyderabad: న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ (balakrishna) న‌టిస్తున్న NBK 108వ సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు భ‌గ‌వంత్ కేస‌రి (bhagavanth kesari) అని టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. ఐ డోన్ట్ కేర్ అనే ట్యాగ్‌లైన్ హైలైట్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ (kajal agarwal), శ్రీలీల (sreeleela) హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. జూన్ 10న టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు కూడా త‌మ‌న్ (thaman) సంగీతం అందిస్తున్నారు. మ‌రి ఏ రేంజ్‌లో బీజీఎం ఇస్తారో వేచి చూడాలి.