Rashmikaతో డేటింగ్ కాదు.. అలా అనుకోకుండా అవుతోంది

Hyderabad: టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda srinivas).. ర‌ష్మిక మంద‌న‌తో(rashmika mandanna) డేటింగ్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా టాక్ న‌డుస్తోంది. రెండు మూడు సార్లు ఎయిర్‌పోర్ట్‌లో క‌లిసి క‌నిపించార‌ని, ఇద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని అంటున్నారు. అయితే దీనిపై బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చేసారు. ఆయ‌న న‌టించిన ఛ‌త్ర‌ప‌తి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ర‌ష్మిక గురించి టాపిక్ వ‌చ్చింది. “స‌ర్.. మీరు ర‌ష్మిక డేటింగ్‌లో ఉన్నారా? చాలా సార్లు ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించారు క‌దా” అని ఓ హిందీ మీడియా జ‌ర్న‌లిస్ట్ అడిగారు. ఇందుకు శ్రీనివాస్ స్పందిస్తూ.. అస‌లు అందులో ఎలాంటి నిజం లేద‌ని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించినంత మాత్రాన క‌లిసి ఎక్క‌డికో వెళ్తున్నామ‌ని కాద‌ని, అనుకోకుండా రెండు మూడు సార్లు ఒకేసారి ఎయిర్‌పోర్ట్‌లో ఎదుర‌య్యామ‌ని తెలిపారు. అలా మీడియా ఫొటోగ్రాఫ‌ర్లు ఫొటోలు తీసేసి క‌లిసి వెళ్తున్నామ‌ని రాసేస్తున్నార‌ని అన్నారు. ఇక‌పోతే.. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన ఛ‌త్ర‌ప‌తి సినిమాను.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వి.వి వినాయ‌క్ హిందీలో సేమ్ టైటిల్‌తో రీమేక్ చేసారు. ఇందులో హీరోయిన్‌గా నుష్ర‌త్ బ‌రూచా న‌టించారు. మే12న సినిమా రిలీజ్ అవ‌బోతోంది.