BSS10: ‘భీమ్లా’​​ డైరెక్టర్​తో బెల్లంకొండ హీరో!

Hyderabad: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమాతో ఒక్కసారిగా టాక్​ ఆఫ్​ టాలీవుడ్​గా మారిపోయిన డైరెక్టర్​ సాగర్ కే చంద్ర(Sagar K Chandra). నటుడు, దర్శకుడు రవిబాబు(Ravi Babu) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సాగర్ నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన ‘అయ్యారే’ సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఆ తర్వాత నారా రోహిత్(Nara Rohit), శ్రీ విష్ణు(Sree Vishnu)తో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. సాగర్​ రూపొందించిన సినిమాలు కమర్షియల్​గా హిట్​ కాకపోయినా టేకింగ్​, స్క్రీన్​ప్లే పరంగా అందరి ప్రశంసలు అందుకున్నాయి.

కాగా, పవన్, రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో డైరెక్టర్ గా మంచి విజయం సాధించారు సాగర్​. ఈ సినిమాకి మాటలు రాసింది త్రివిక్రమ్ అయినా పవన్​ అభిమానులను మెప్పించేలా రూపొందించింది మాత్రం డైరెక్టరే. కానీ ఈ సినిమా తర్వాత కూడా సాగర్​ పెద్దగా అవకాశాలు అందుకోలేదు. కాగా, తాజాగా  బెల్లంకొండ్ర శ్రీనివాస్ తో సాగర్ చంద్ర సినిమాని ప్రకటించారు. నేడు సాగర్ చంద్ర పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్​ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో సాగర్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ K చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది శ్రీనివాస్ కి 10వ సినిమా కావడం విశేషం.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా కూడా విజయం అందుకోలేకపోయింది. మరి సాగర్​ దర్శకత్వంలో రూపొందే BSS10 సినిమాతో అయినా బెల్లంకొండ హీరో సక్సెస్​ ట్రాక్​ ఎక్కుతాడో చూడాలి.