Behind Woods: అల్లు అర్జున్​ మాస్​ ఎంట్రీ​!

Hyderabad:  పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప(Pushpa) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన బన్నీ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సుకుమార్(Sukumar)​ డైరెక్షన్​లో వచ్చిన ఈ మూవీలో పక్కా ఊర మాస్ పుష్పరాజ్ పాత్రలో బన్ని నటనకు దేశమే ఫిదా అయ్యింది. ముఖ్యంగా మేకోవర్, మేనరిజం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలీవుడ్(Bollywood)​లోనూ ఈ సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా బన్నీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ అంతా పుష్ప 2(Pushpa2) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే బన్ని బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇటీవల సౌత్​ సినిమా సెలబ్రేషన్స్​లో ఒకటైన బిహైండ్ వుడ్స్ సినిమా వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు చాలామంది దక్షిణాది సినీతారలు హాజరయ్యారు. రిషబ్ శెట్టి, నయనతార, శింబు, త్రిష, మృణాల్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్లో బన్నీ కూడా సందడి చేశారు. ఈ కార్యక్రామంలో అల్లు అర్జున్ ఎంట్రీ  వీడియోను తాజాగా బిహైండ్ ది వుడ్స్ షేర్ చేసింది. గూస్​బంప్స్​ తెప్పించేలా ఉన్న ఈ వీడియో క్షణాల్లో తెగ వైరలైంది. బ్లాక్ అండ్ వైట్ సూట్లో అల్లు అర్జున్ మాస్ ఎంట్రీతో అదరగొట్టేశారు. సోషల్​ మీడియాలో ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్​ వస్తోంది.

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్​తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా రానుందని తెలుస్తోంది.